కరీంనగర్: సాధారణంగా గన్ లైసెన్సు కోసం రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. కానీ మానకొండూరు మండలం వేగురుపల్లి ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ గా సేవలందిస్తున్న రామ్ నర్సయ్య మాస్టారు గన్ లైసెన్సు కోసం అప్లై చేసుకున్నారు. తనకు గన్ లైసెన్స్ ను మంజూరు చేయాలంటూ పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు సమర్పించారు.
“సమాచార హక్కు చట్టం( ఆర్టీఐ) ద్వారా చాలామంది ఉద్యోగుల అక్రమాలను నేను వెలుగులోకి తెచ్చాను. ఈక్రమంలో పలువురు ఉద్యోగులపై పలుమార్లు సస్పెన్షన్ వేటు పడింది. సమాచార హక్కు చట్టం ద్వారా పోరాటం చేసి ఎంతో అవినీతి సొమ్మును ప్రభుత్వ ఖజానాలో తిరిగి జమ చేయించాను. నా వల్ల సస్పెండ్ అయిన వారితో నాకు ప్రాణహాని ఉంది”అంటూ దరఖాస్తులో రామ నర్సయ్య వెల్లడించారు.