
- టెన్త్ స్టూడెంట్‌పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు
పుల్కల్, వెలుగు : టెన్త్ విద్యార్థిని పట్ల ఓ స్కూల్ ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని సర్వైస్రాయ్ స్కూల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సర్వైస్రాయ్ స్కూల్ ప్రిన్సిపాల్షేక్ హైమద్ గత కొన్ని రోజులుగా ఓ టెన్త్ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. మూడు రోజుల క్రితం సదరు స్టూడెంట్ను తన గ్రామంలో దింపుతానని చెప్పి కారు ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ విషయాన్ని స్టూడెంట్ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరుసటిరోజు విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ వద్దకు రావడంతో ప్రిన్సిపాల్ రెండు మూడు రోజుల పాటు స్కూల్ కు రాడని సిబ్బంది చెప్పారు.
దీంతో వారు ఎంఈవో దండు అంజయ్యకు ఫిర్యాదు చేశారు. ఆయన చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098 ద్వారా అధికారులకు చెప్పారు. అక్కడి నుంచి పుల్కల్ ఎస్ఐ శ్రీకాంత్ కు ఆదేశాలు రావడంతో శనివారం షేక్ హైమద్ ను అరెస్ట్ చేసి జోగిపేట కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించారు.