నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ, లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం రాత్రి ఈ ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీ రామ నవమి రోజున క్యాంపస్ లోని కావేరి హాస్టల్ లో మాంసాహారం వడ్డించడంపై ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగాయి. పండగ రోజు నాన్ వెజ్ తినొద్దని ABVP గట్టిగా డిమాండ్ చేసింది. దీంతో లెఫ్ట్ వింగ్ కు చెందిన SFI, DSF, AISA విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. మెనూ ప్రకారం సండే రోజు నాన్ వెజ్ ఉంటుందని వారు వాదించారు. పండగ రోజు నాన్ వెజ్ ఏంటని ఏబీవీపీ విద్యార్థులు ప్రశ్నించారు. ఈ వివాదం కాస్త ముదిరి... రెండు స్టూడెంట్ యూనియన్లు కొట్టుకునేంత వరకు వెళ్లింది. కాగా.. ఏబీవీపీ విద్యార్థులు తమపై తీవ్రంగా దాడి చేశారని లెఫ్ట్ వింగ్ స్టూడెంట్స్ చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ గొడవలో దాదాపు 15 మందికి పైగా విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. జేఎన్యూఎస్యూ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


మరిన్ని వార్తల కోసం..

14,15 తేదీల్లో బ్యాంకులకు సెలవు

షాంఘైలో ఆకలి కేకలు!