నేను ఉన్నా ఉపయోగంలేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్ సెల్ఫీ వీడియో వైరల్

ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. శ్యామ్ మరణ వార్త.. కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ ను, ఆయన అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసింది. శ్యామ్ చనిపోయి మూడు రోజులు అవుతున్నా.. అతని మరణానికి గల కారణాలు తెలియలేదు. దీంతో శ్యామ్ ది ఆత్మహత్య కాదని, ఎవరో కావాలనే శ్యామ్ ను చంపేసుంటారను అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు శ్యామ్ కు న్యాయం జరగాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ '#WeWantJusticeForShyamNTR' అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేశారు.  

ALSO READ:18 దేశాలను చుట్టిరానున్న వరల్డ్ కప్ 2023 ట్రోఫీ 

అయితే తాజాగా ఈ అనుమానాలకు పులిష్టాప్ పెడుతూ.. శ్యామ్ చనిపోయే ముందు తీసిన సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో శ్యామ్.. అమ్మా నాన్నా నన్ను క్షమించండి. నేను అందరి దృష్టిలో వేస్ట్. నేను ఉన్నా కూడా మీకు ఉపయోగం లేదు. నాకు జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మల్లి జన్మ ఉంటే మీకే కొడుకుగా పుట్టాలి" అంటూ చెప్పుకొచ్చాడు శ్యామ్. ఇక ఈ వీడియోతో శ్యామ్ మరణంపై వస్తున్న అనుమానాలకు ఫులిస్టాప్ పడింది.