
వరంగల్సిటీ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుస సెలవులు రానున్నాయి. జూన్ 1 నుంచి 6 వరకు ఈ సెలవులు ఉండటంతో రైతులు మార్కెట్కు సరుకులు తీసుకురావద్దని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు రావడంతోపాటు లోక్సభ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఏనుమాముల మార్కెట్లో ఉండటంతో జూన్ 6వరకు అధికారులు సెలవులు ప్రకటించారు.