
మెదక్: మెదక్ జిల్లా చింతకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గేటు వద్ద మెదక్ హైదరాబాద్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీ కొనడంతో బైక్స్పై ఉన్న ముగ్గురు రోడ్డు మీద పడ్డారు. సడన్గా రోడ్డు మీద పడిపోవడంతో లారీ తొక్కుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైకులపై నుంచి రోడ్డుపై పడిన ముగ్గురూ స్పాట్లోనే చనిపోయారు. చనిపోయిన వారిని వెంకట్రావుపల్లికి చెందిన వారిగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో మెదక్ హైదరాబాద్ రోడ్డుపై విషాద వాతావరణం కనిపించింది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి బుల్లెట్పై ప్రయాణం చేస్తుండగా ఆకుపాముల వద్ద గేదెను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో గేదె బుల్లెట్ బండికి తగిలి బుల్లెట్పై ప్రయాణం చేస్తున్న అన్నా చెల్లెలు రోడ్డుకు ఇరుపక్కల పడడంతో చెల్లి చెడే యశస్విని 25 (సం) పై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.