వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె వద్ద ఏప్రిల్ 16వ తేదీ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. బైక్ ను లారీ వేగంగా ఢీకొనడంతో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయినవారిని చెన్నూరు బెస్త కాలనీకి చెందిన సురేష్, దినేష్, సుబ్బయ్యలుగా గుర్తించారు. 

ముగ్గురు యువకులు ఒంటిమిట్ట నుండి చెన్నూరుకు బైక్ పై వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న చెన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను కడప రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.