ఎలా చంపాలనిపించిందో.. హైదరాబాద్లో ఏడేళ్ల బాలుణ్ని తలపై రాళ్లతో కొట్టి పొదల్లో పడేశారు

ఎలా చంపాలనిపించిందో.. హైదరాబాద్లో ఏడేళ్ల బాలుణ్ని తలపై రాళ్లతో కొట్టి పొదల్లో పడేశారు

కొన్ని ఘటనలు చూస్తుంటే ఈ రోజుల్లో మానవత్వం అనే మాటకు రోజులు చెల్లిపోయాయేమో అనిపిస్తుంటుంది. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా కొందరు క్రూరంగా వ్యవహరిస్తుండటం ఆందోళనకు గరిచేస్తోంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏడేండ్ల చిన్న పిల్లాడిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. 

వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డెన్ సిటీలో ఏడేళ్ల బాలుడిని కొట్టి చంపారు దుండగులు.  బాలుడి తలపై రాళ్ళతో కొట్టి చంపి మీరాలం ట్యాంక్ సమీపంలో పారేశారు. స్తానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని బాలుడిని పొదల్లో నుంచి బయటకు తీశారు. 

రాళ్లతో తల, మొహంపై కొట్టడంతో మెదడు డ్యామేజ్ అయ్యి బాలుడు చనిపోయి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. బాలుడు ఎవరు ? అనే కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు. చుట్టూ పక్కన పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు.