తిరుచ్చి విమానాశ్రయంలో హై అలర్ట్.. 2 గంటల నుంచి గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు

తిరుచ్చి విమానాశ్రయంలో హై అలర్ట్.. 2 గంటల నుంచి గాల్లోనే ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు

తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలోని హైడ్రాలిక వ్యవస్థలో సమస్య తలెత్తింది. దీంతో.. విమానాన్ని తిరిగి తిరుచ్చి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్కు పైలైట్లు ప్రయత్నిస్తున్నారు.

అయితే సాధారణ ల్యాండింగ్ అసాధ్యం అని అధికారులు తేల్చేశారు. అందుకే ల్యాండింగ్కు ముందు ఇంధనాన్ని తగ్గించడానికి విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టిస్తున్నామని అధికారులు తెలిపారు. దాదాపు రెండు గంటల నుంచి గాల్లోనే విమానం చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

 

బెల్లీ ల్యాండింగ్ చేస్తే విమానం పల్టీలు కొట్టే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరుచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. తిరుచ్చి విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఇతర విమానాలను దారి మళ్లించారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది.