క్రికెట్ లో ఫీల్డింగ్ అంటే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ఠక్కున గుర్తుకొస్తాడు. మెరుపు రనౌట్లు, పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచ్ లు పట్టడం అతడి దగ్గర నుంచే మొదలైంది. ముఖ్యంగా పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ రోడ్స్ పట్టే క్యాచ్ లు ఔరా అనిపిస్తాయి. తాజాగా అచ్చు గుద్దినట్టే అలాంటి క్యాచ్ ఒకటి క్రికెట్ లో నమోదయింది. ఆస్ట్రేలియా ఫీల్డర్ మార్నస్ లబుషేన్ పట్టిన ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనకుండా ఉండలేం.
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య నేడు (ఫిబ్రవరి 6) జరిగిన మూడో వన్డేలో లబుషేన్ పట్టిన క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. విండీస్ ఇన్నింగ్స్ 11 ఓవర్లో మూడో బంతికి లాన్స్ మోరీస్ వేసిన బంతిని కార్టీ పాయింట్ వైపుగా ఆడాడు. పాయింట్ వైపు గట్టిగా ఆడిన కార్టీ లబుషేన్ పట్టిన అద్భుత క్యాచ్ కారణంగా పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. పాయింట్ నుంచి దూరంగా వెళ్తున్న ఈ బంతిని ఫుల్ డైవ్ చేస్తూ పక్షిలా రెండు చేతులతో ఒడిసి పట్టాడు. నమ్మశక్యం కానీ ఈ క్యాచ్ మాజీ సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ ను గుర్తు చేసింది.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విండీస్ జట్టును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 86 పరుగులకే ఆలౌటైంది. 87 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి ఆస్ట్రేలియాకు 41 బంతులు సరిపోయాయి. ఈ మ్యాచ్ గెలవడంతో ఆస్ట్రేలియా సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 1-1 తో సమమైన సంగతి తెలిసిందే.
Marnus Labuschagne is an insane fielder. ?pic.twitter.com/9gg7kfV9IM
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2024