చెన్నూరులో బీఆర్ఎస్కు షాక్ ..రాజీనామా చేసిన మున్సిపల్ కౌన్సిలర్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. తాజాగా చెన్నూరు మున్సి పాలిటి ఒకటవ వార్డు కౌన్సిలర్ పోగుల సతీష్ బీఆర్ ఎస్ పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు. బీఆర్ ఎస్ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని..అందుకే పార్టీకీ రాజీనామా చేస్తున్నామని పోగుల సతీష్ స్పష్టం చేశారు. ఇసుక దందాలో బాల్క సుమన్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అడ్డు వచ్చిన వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సతీష్ అన్నారు.