ఇల్లెందులో బీఆర్ఎస్​కు షాక్.. రాజీనామా చేసిన ఎంపీటీసీలు, సర్పంచులు

  • రిజైన్​ చేసిన వారిలో ఎంపీటీసీలు, 
  • సర్పంచులు, పీఏసీఎస్​ డైరెక్టర్లు 
  • పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక

మహబూబాబాద్​అర్బన్, వెలుగు: ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్​కు షాక్ తగిలింది. మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలంలోని బీఆర్ఎస్​ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, పీఏసీఎస్​ డైరెక్టర్లు బీఆర్​ఎస్​కు రాజీనామా చేశారు. మహబూబాబాద్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ ఆఫీసులో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్​చంద్​రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. బయ్యారం, గార్ల మండలానికి చెందిన సర్పంచులు దనసరి కోటమ్మ, వజ్జ అనసూర్య, గుగులోత్​ శైలజ, వట్టం స్వరూప, వట్టం లక్ష్మణ్​రావు, భూక్య పద్మ, కుంజ కిరణ్​, బోడ రమేశ్​, గుగులోత్​ రాజు, ఎంపీటీసీలు తిరుమల శైలజ, ఏనుగుల అన్నపూర్ణ, ఉప సర్పంచులు వీరబోయిన కవిత, తంగెళ్లపల్లి వీరభద్రం, తోట లక్ష్మీపతి, సనప నాగేశ్​, వీరస్వామి, లక్ష్మి, పీఏసీఎస్​ డైరెక్టర్లు తెల్లం బిక్షం, చిరుమల ప్రభాకర్​రెడ్డి, భాగర్లమూడి భాస్కర్, వెలుపల్లి శ్రీను, కాసనబోయిన శ్రీను, వార్డు మెంబర్లు  రిజైన్​ చేసిన వారిలో వారిలో ఉన్నారు.