మెట్రో ప్రయాణికులకు షాక్.. ఇకపై ఆ మెట్రోస్టేషన్లలో కూడా పెయిడ్ పార్కింగ్ 

మెట్రో ప్రయాణికులకు షాక్.. ఇకపై ఆ మెట్రోస్టేషన్లలో కూడా పెయిడ్ పార్కింగ్ 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఇకపై సిటీలో అన్ని మెట్రో స్టేషన్లలో పార్కింగ్ కు డబ్బులు చెల్లించాల్సిందే.. ఆగస్టు 14, 2024 న ఈ విషయాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ స్పష్టం చేసింది. నిన్నటి వరకు హైదరాబాద్ సిటీలోని నాగోల్, మియాపూర్ స్టేషన్లలో ఫ్రీ పార్కింగ్ కొనసాగింది. అయితే ఇకపై ఈ రెండు స్టేషనల్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తున్నట్లు చెప్పింది.

ఇప్పటికే మిగతా అన్ని స్టేషన్లలో HMR, L&T కంపెనీలు పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తున్నాయి.  3కారిడార్లు, 59 స్టేషన్లలో 40 స్టేషన్లలో పార్కింగ్ సదుపాయం ఉంది. చివరి స్టేషన్ అయిన నాగోల్ వద్ద ఆగస్టు 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ లో,  సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ లో పెయిడ్ పార్కింగ్ అమలు జరుగుతుందన్నారు.

బుధవారం పైలట్ రన్ గా పెయిడ్ పార్కింగ్ స్టార్ట్ చేశామని ఎల్ అండ్ టీ అధికారులు చెప్పారు.ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం..పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు, సౌకర్యాల కోసం  పార్కింగ్ ఫీజులను పర్మినెంట్ గా డిస్ ప్లే చేస్తున్నామన్నారు ఎల్ అండ్ టీ అధికారులు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.