ఒక వ్యక్తి మూత్రపిండం నుంచి 154 రాళ్లు వెలికితీసిన షాకింగ్ ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. డాక్టర్ రాఘవేంద్ర చెప్పిన వివరాలు ప్రకారం రామగుండం అనే ఊరిలో ఉన్న 45 ఏళ్ల వ్యక్తి కొన్ని రోజుల నుంచి మధుమేహం అనే వ్యాదితో బాధపడుతుండగా బంధువులు గమనించి హాస్పిటల్ లో చేర్చారు . అయితే పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆవ్యక్తి శరీరంలో 154 రాళ్లు ఉండటం గమనించి ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే ఆ రాళ్లను కంటోన్మెంట్ విక్రంపురిలోని ఎషియన్ ఇన్‌స్టిట్యుట్ ఆప్ నెప్రాలజీ అండ్ యూరాలజీ ద్వారా వెలికితీశామని చెప్పారు . అయితే దీనిలో 6 వేల 232 మిల్లీమిటర్ల మెర పెద్ద రాయితో పాటు 153 చిన్న రాళ్లను గుర్తించారు డాక్టర్లు.
ఈ రాళ్లను బయటకు తీయటం అంటే ఆషామాషీ కాదు.. చిన్న చిన్న రాళ్లు అయితే పర్వాలేదు కానీ.. పెద్దవి ఉండటంతో.. ఎండోస్కోపింగ్ విధానంలో లేజర్ విధానంలో.. పెద్ద రాయిని ముక్కలుగా విడగొట్టారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి మొత్తం 154 రాళ్లను బయటకు తీశారు. ప్రస్తుతం బాధితుడు ఆరోగ్యంగా ఉన్నాడని.. త్వరగా కోలుకుంటున్నాడని స్పష్టం చేశారు వైద్యులు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని.. కిడ్నీల్లో ఇంత పెద్ద రాయి ఉండటం కూడా చాలా కొన్ని కేసులు మాత్రమే ఉంటాయన్నారు. పలు దశల్లో చికిత్స చేయటం ద్వారా.. కిడ్నీలోని అన్ని రాళ్లను బయటకు తీసినట్లు వెల్లడించారు యూరాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర.