US Elections 2024: అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారంటే..

US Elections 2024: అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారంటే..

అమెరికా అధ్యక్షలు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నవంబర్ 5న ఎన్నికలు జరుగనున్నాయి. అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరా ప్రచారం నిర్వహిస్తున్నారు. అమెరికన్ ఓటర్లు ఆకట్టుకునేందుకు వారివారి స్టాటజీని ప్రదర్శిస్తున్నారు. అయితే అమెరికన్ ఓటర్లను ఆకర్షించడంలో ట్రంప్ గతంలో కొంత వెనకబడినప్పటికీ ప్రస్తుతం కమలా, ట్రంప్ ఇద్దరూ సమఉజ్జీలుగా ఉన్నట్లు పోల్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడి ఎన్నికల నిర్వహణ, ఎన్నుకునే విధానం గురించి తెలుసుకుందాం. 

అమెరికాలో 16కోట్ల ఓటర్లున్నారు. అయితే ఇందులో అందరూ ఓటు వేయరు. 2020 ఎన్నికల్లో 66 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఒకటి డెమోక్రాట్లు, రెండో రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థిగా కమలా హారీస్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.. మొదట డెమోక్రాట్ల అభ్యర్థిగా బైడెన్ ఉన్నప్పటికీ.. అతని సామర్థ్యంపై పలు ప్రశ్నలు లేవనెత్తడంతో కమలా హారీస్ ను బరిలో ఉంచారు. 

మరోవైపు గ్రీన్ పార్టీ తరపున జిల్ స్టెయిన్, లిబర్టేరియన్ పార్టీ కి చెందిన చేజ్ ఆలివర్, యుద్ధ వ్యతిరేక విద్యావేత్త కార్నెల్ వెస్ట్ వంటి స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు.  

అమెరికా ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థులు తమ సొంత రన్నింగ్ మేట్లను కూడా నియమిస్తారు.  అమెరికా 2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల రన్నింగ్ మేట్ మిన్నై సోటా గవర్నర్ టిమ్ వాల్జ్, రిపబ్లికన్ల ఒహియో సెనేటర్ జేడీ వాన్స్ ఉన్నారు. వీళ్లు గెలిస్తే వైస్ ప్రెసిడెంట్లుగా అవుతారు. 

ఓటర్లు తమ ఓటును  ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కోసం వేస్తారు. కానీ ఫలితాలు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా నిర్ణయించబడతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో ముందుగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. 2024  అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికే 5కోట్ల 2 లక్షల ఓట్లకు పైగా పోలాయ్యాయి. 

US అధ్యక్షుడిని నేరుగా ఓటర్లు ఎన్నోకోరు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎంపిక చేస్తారు. నవంబర్5న అమెరికన్లు ఎలక్టోరల్ కాలేజీని రూపొందించే ఎలక్టర్లకు ఓటు వేస్తారు. రాష్టంలో మెజారిటీ ఓట్లు ఉన్న అభ్యర్థి సాధారణంగా రాష్ట్ర ఎలక్టోరల్ గా కాలేజీ ఓట్లను అందుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.  అంటే అభ్యర్థి రాష్ట్రపతి అధ్యక్షుడు కావడానికి 270 సాధించాల్సి ఉంటుంది. 

అమెరికా అధ్యక్ష ఎంపిక వ్యవస్థ లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకోవచ్చు. అయితే ఎలక్టోరల్ కాలేజీని కోల్పోవచ్చు. ఇలా US చరిత్రలో ఐదుసార్లు జరిగింది. 2016లో దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఓట్లతో వెనుకబడి ఉన్నప్పటికీ ట్రంప్ హిల్లరీ క్లింటన్‌ గెలిచి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. 2024 ఎన్నికల్లో అమెరికన్ ప్రజలు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారు.. తమ మద్దతు ట్రంప్ కా లేక కమలా హారీస్ కా అనేది మరో ఆరు రోజుల్లో తేలనుంది.