![బ్యాటరీ బైక్ తయారు చేసిన సింగరేణి కార్మికుడు](https://static.v6velugu.com/uploads/2021/03/bike.jpg)
రామకృష్ణాపూర్/మందమర్రి, వెలుగు: పెట్రోల్ చార్జీలు పెరగడం, నిత్యం వంద కి.మీ.లు ప్రయాణించాల్సి రావడంతో సింగరేణి కార్మికుడు ఒకరు సాధారణ బైక్‌ను కరెంట్బైక్గా మార్చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన సల్వాది వెంకటేశ్వర్లు గోదావరిఖనిలోని ఓసీపీ3లో ఎలక్ట్రీషియన్‌గా చేస్తున్నారు. 32 ఏళ్లుగా డ్యూటీ చేస్తున్న ఆయన రోజూ పాత హీరో హోండా బైక్‌పై 100 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. తరచూ పెట్రోల్ ధరలు పెరిగిపోతుండడంతో బైక్‌ను బ్యాటరీతో నడిపించేలా చేయాలని అనుకున్నారు. అందుకు అవసరమైన బ్యాటరీలు, మోటార్, ఇతర సామగ్రిని రూ.25 వేలు ఖర్చు చేసి ఆన్లైన్లో కొన్నారు. డ్యూటీ చేస్తూనే ఖాళీ సమయంలో బ్యాటరీతో నడిచే బైక్‌ను ఐదు రోజుల్లో తయారు చేశారు. బుధవారం స్థానికులు, విలేకరుల ఎదుట బైక్ ను నడిపించారు. రెండున్నర గంటలు చార్జింగ్ చేస్తే సుమారు 80 కి.మీ. దూరం ప్రయాణించవచ్చని వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.