ఎస్సీ వర్గీకరణపై ఆరుగురితో కమిటీ

ఎస్సీ వర్గీకరణపై ఆరుగురితో కమిటీ
  • మంత్రి ఉత్తమ్​ కుమార్​ చైర్మన్..కో చైర్మన్​గా మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కో-చైర్మన్‌‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. 

ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికను పరిశీలించాక వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది.