ముంబై: థర్డ్ అంపైర్ వేగంగా, కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ సీజన్ ఐపీఎల్‌లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా టీవీ అంపైర్ గదిలోనే ఉండే ఇద్దరు హాక్-ఐ సిస్టమ్ ఆపరేటర్లు అతనికి నేరుగా ఇన్‌పుట్స్ ఇస్తారు. గ్రౌండ్ మొత్తం కవర్ చేసే ఎనిమిది హై-స్పీడ్ కెమెరాలు తీసిన ఫొటోలతో థర్డ్ అంపైర్‌కు సాయం చేస్తారు.
ఈ కొత్త సిస్టమ్ స్ప్లిట్–స్ర్కీన్ ఇమేజ్‌లతో గతంలో కంటే ఎక్కువ విజువల్స్‌ను విశ్లేషించడానికి టీవీ అంపైర్‌ను అనుమతిస్తుంది. అలాగే హాక్-ఐ ఆపరేటర్లతో అంపైర్ మాటలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దాంతో ఏ జరుగుతుందనే దానిపై ప్రేక్షకులకు స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్‌పై అవగాహన కల్పించేందుకు ఐపీఎల్ అంపైర్లకు బీసీసీఐ ఈ మధ్యే రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది.