ఉద్యోగిపై కాటు వేసిన పాము

హైదరాబాద్​:   ఎన్నికల డ్యూటీలో ఉన్న  ఉద్యోగిపై పాము కాటు వేసింది. జైనథ్ మండలం ముక్తాపూర్ లో టీచర్​గా పనిచేస్తున విపుల్ రెడ్డి దిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అందర్ బంద్ ఆశ్రమోన్నత పాఠశాల ఆవరణలో ఓపీవో గా ఎన్నికల విధులకు వెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ 15వ పోలింగ్ కేంద్రంలో ఆయన టాయిలెట్ కు వెళ్లిన సమయంలో పాము కాటు వేసింది. వెంటనే ఆయనను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.   ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ఫోన్ లో పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.