మేడువాయి అంగన్​వాడీ కేంద్రంలోకి తాచుపాము

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణ శివారున ఉన్న అల్లూరి జిల్లా ఏటపాక మండలం మేడువాయి అంగన్​వాడీ కేంద్రంలోకి శుక్రవారం తాచుపాము వచ్చింది. కేంద్రంలోని చిన్నారులు భయపడి పరుగులు తీశారు. దీంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కర్మాగారం ఎంప్లాయి అవధానుల శ్రీనివాసశాస్త్రి హుటాహుటిన మేడువాయి చేరుకుని చాకచక్యంగా పట్టుకున్నారు. జనసంచారం లేని గోదావరి ప్రాంతంలో దానిని వదిలేశారు. దీంతో చిన్నారులు, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు ఊపిరి పీల్చుకున్నారు.