స్కూటీలో తాచు పాము.. యాదాద్రి జిల్లా మోత్కుర్ టౌన్లో ఘటన

మోత్కూరు, వెలుగు: స్కూటీలో పాము దూరింది. బండి తీయగా సీటు కింద నుంచి బుసలు కొడుతున్న చప్పుడు రావడంతో భయంతో వదిలేసి దూరంగా వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన బోయిని యాకయ్య తన ఇంటి ముందు స్కూటీని పార్కు చేశాడు. ఆదివారం ఉదయం బయటకు వెళ్లేందుకు అతడు స్కూటీని తీసి స్టార్ట్ చేయగా అందులోంచి పాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో భయపడి బండిని వదిలేసి దూరంగా వెళ్లాడు. స్థానికులకు తెలపడంతో వచ్చి స్కూటీని మున్సిపల్ ఆఫీసు ఆవరణలోకి తీసుకెళ్లారు. సీటు తీసినప్పటికీ అది బయటకు రాలేదు. చివరకు పామును చంపి బయటికు తీశారు.