మదాపూర్ మైండ్ స్పేస్‌లో సాఫ్ట్​వేర్ ఎంప్లాయ్ సూసైడ్ : ఆఫీస్ బిల్డింగ్‌పై నుంచి దూకే..

మాదాపూర్, వెలుగు: మదాపూర్ మైండ్​ స్పేస్ లో సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. 12సీ బిల్డింగ్ 13వ ఫ్లోర్​ నుంచి కిందకు దూకి స్పాట్​లోనే మృతి చెందాడు. గుంటూరు జిల్లా అమరావతి మండలం నెమలికల్లు గ్రామానికి చెందిన నవీన్​రెడ్డి (24) ఆరు నెలల కిందట సిటీకి వచ్చాడు. మాదాపూర్​లోని ఓ ప్రైవేట్​హాస్టల్​లో నివాసం ఉంటూ.. మైండ్​స్పేస్12సీ బిల్డింగ్​లోని ఎన్​సీఆర్​వోయిక్స్ ఆఫీస్​లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 8 గంటలకు ఒంటరిగా బిల్డింగ్​లోని13వ ఫ్లోర్​కు వెళ్లి కిందకు దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో స్పాట్​లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాదాపూర్​ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నవీన్​రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.