సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానంటూ సాఫ్ట్​వేర్​ ఉద్యోగినిపై అత్యాచారం

సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానంటూ సాఫ్ట్​వేర్​ ఉద్యోగినిపై అత్యాచారం
  • అసిస్టెంట్​ డైరెక్టర్​ సిద్ధార్థ్​ వర్మ అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానంటూ సాఫ్ట్​వేర్ ఉద్యోగినిపై ఓ అసిస్టెంట్​డైరెక్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడిని అరెస్ట్​చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వైజాగ్​కు చెందిన సిద్ధార్థ్​వర్మ(30) కొండాపూర్​ రాఘవేంద్రకాలనీలో ఉంటూ, సినీ ఫీల్డ్​లో అసిస్టెంట్​డెరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

ఇతనికి కొన్ని నెలల కింద పుప్పాలగూడలో ఉంటూ ఐటీ కారిడార్​పరిధిలోని ఓ సాఫ్ట్​వేర్​కంపెనీలో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన యువతి పరిచయమైంది. సినిమాల్లో చాన్స్​ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఓ రోజు డిన్నర్ పేరిట యువతిని తన ఇంటికి రప్పించాడు. కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి యువతితో తాగించాడు. స్పృహ కోల్పోయిన ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత విషయం తెలుసుకున్న బాధితురాలు సిద్ధార్థ్​వర్మపై గచ్చిబౌలి పోలీసులకు​ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం సిద్ధార్థ్ వర్మను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.