తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల హుక్కా నిషేదించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పోలీసులు హుక్కా సెంటర్లు నిర్వహించినా, హుక్కా పరికరాలు అమ్మినా సమాచారం వచ్చినా దాడులు చేస్తున్నారు. ఫర్గెట్ మీ నాట్ కేఫ్ అనే పేరుతో హుక్కా సెంటర్ నడుపుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. మాదాపూర్ లోని దుర్గంచెరువు ప్రాంతంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఈరోజు పలు హోటళ్లో, బారుల్లో రైడ్స్ చేశారు.
నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న ఫర్గెట్ మీ నాట్ కేఫ్ పేరుతో హుక్కా సెంటర్ నిర్వహిస్తున్న యజమాని అభినవ్ రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఓనర్ పాటర్న్ తొట్టి ఆజం పరారీలో ఉన్నాడు. హుక్కా ఫ్లేవర్డ్- పెట్టెలు, 10 హుక్కా పార్ట్స్, మూడు సెల్ ఫోన్స్ నిందితులను దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.