రాజ్ కోట్ టెస్టులో భారత్ భారీ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు పటిష్ట స్థితిలో నిలిచిన రోహిత్ సేన రెండో రోజు ఆ జోరు కొనసాగించింది. దీంతో లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది. క్రీజ్ లో బౌలింగ్ ఆల్ రౌండర్ అశ్విన్(25), టెస్ట్ అరంగేట్రం చేసిన జురెల్(31) ఉన్నారు. చేతిలో మరో మూడు వికెట్లు ఉండటంతో మరో 50 నుంచి 60 పరుగులు జోడించే అవకాశం ఉంది. లంచ్ తర్వాత అశ్విన్, జురెల్ జోడీ ఎలా ఆడతారో ఆసక్తికరంగా మారింది.
5 వికెట్లకు 326 పరుగుల వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ సేన.. రెండో రోజు ప్రారంభంలోనే జడేజా,కుల్దీప్ యాదవ్ ల వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోర్ 331 పరుగుల వద్ద నైట్ వాచ్ మెన్ కుల్దీప్ యాదవ్.. ఆండర్సన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే తొలి రోజు సెంచరీ హీరో జడేజా రూట్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 331 పరుగులకే 7 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో టీమిండియాను ఆదుకునే బాధ్యతను అశ్విన్, జురెల్ తీసుకున్నారు.
Also read : IND vs ENG: నేను వెళ్ళకూడదనుకున్నా..సూర్య నా మనసు మార్చేశాడు: సర్ఫరాజ్ తండ్రి
8వ వికెట్ కు అజేయంగా 57 పరుగులు జోడించి భారత్ ను పటిష్ట స్థితికి చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగకుండా ఆచితూచి బ్యాటింగ్ చేశారు. క్రీజ్ లో ఉన్నంత సేపు వికెట్ కు ప్రాధాన్యత ఇస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టారు. దీంతో స్కోర్ వేగం మందగించినా వికెట్లను కాపాడుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ కు మూడు వికెట్లు లభించాయి. హర్టీలి,రూట్, ఆండర్సన్ కు తలో వికెట్ లభించింది.
#INDvsENG #ENGvsIND
— News18 CricketNext (@cricketnext) February 16, 2024
Lunch on Day 2!
A solid partnership between R Ashwin (25*) & Dhruv Jurel (31*) headlines India's fightback in the morning session
Score 388/7 in 113 overshttps://t.co/Zk8TXVxBxB