జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మర గ్రామంలో సంక్రాంతి పండుగకు అత్తారింటికి వచ్చిన అల్లుడు అదృశ్యమయ్యాడు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కు చెందిన రవికుమార్ అనే వ్యక్తికి పాలకుర్తి మండలానికి చెందిన జయంతితో 2024 డిసెంబర్ 26న వివాహం అయ్యింది.
సంక్రాంతి పండుగకి పాలకుర్తిలోని అత్తారింటికి వెళ్లాడు. జనవరి 15న రాత్రి 7.30 గంటలకు స్నేహితులు ఫోన్ చేస్తున్నారు.. మాట్లాడి వస్తా అని భార్యకు చెప్పి వెళ్లాడు రవికుమార్. రాత్రి 8:30 గంటలకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని భార్య జయంతి తెలిపింది.ఇంట్లో నుంచి వెళ్లి 42 గంటలు అవుతున్నా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు అతడి బంధువులు,కుటుంబ సభ్యులు.
ALSO READ | ఓ మై గాడ్: పెద్ద ప్రమాదమే తప్పింది.. కొంచెం ఉంటే బస్సు లోయలో పడేది..
రవికుమార్ భార్య జయంతితో పాటు , కుటుంబ సభ్యులు జనవరి 16న పాలకుర్తి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.