గోరుముద్దలు పెట్టిన తల్లికి బుక్కెడన్నం పెట్టలేక..

గోరుముద్దలు పెట్టిన తల్లికి బుక్కెడన్నం పెట్టేందుకు చేతులు రాక ఇంటి నుంచి గెంటేశాడు ఓ కొడుకు. దిక్క తోచని స్థితిలో ఉన్న ఆ తల్లికి ఆలయమే ఆశ్రయమైంది. నిజామాబాద్​ సిటీకి చెందిన లక్ష్మి (60) భర్త, పెద్దకొడుకు చనిపోగా, చిన్నకొడుకు వద్ద ఉంటోంది. తల్లి బాగోగులు చూసుకోవడం తన వల్ల కాదంటూ కొడుకు శనివారం రాత్రి నగరంలోని గాయత్రినగర్​లో ఉన్న వినాయకుడి ఆలయంలో వదిలిపెట్టి పోయాడు. అల్లారుముద్దుగా పెంచిన కొడుకే ఇలా రోడ్డున పడేశాడంటూ ఆమె కంటి తడి పెట్టడం స్థానికులను కలిచివేసింది. -

-  వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్