అటవీ మార్గంలో శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

అటవీ మార్గంలో శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

శబరిమల: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌‌ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) శుభవార్త చెప్పింది. పులిమేడు, ఎరుమేలి అటవీ మార్గాల్లో కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామ ని బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ‘‘పంపా నుంచి స్వామి అయ్యప్పన్ రోడ్డు మీదుగా భక్తులు సన్నిధానానికి చేరుకుంటారు. నీలిమల మార్గం గుండా వెళ్లాలనుకునే వారు కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు’’ అని ఆయన మీడియాకు వివరించారు. "మరక్కూట్టం వద్ద ప్రత్యేక ట్యాగ్‌‌లు కలిగిన యాత్రికులు చంద్రానందన్ రోడ్డు ద్వారా సన్నిధానంలోకి ప్రవేశించవచ్చు. పులిమేడు, ఎరుమేలి నుంచి ఈ నిర్దేశిత అటవీ మార్గాల ద్వారా వచ్చే వారికి ప్రత్యేక ట్యాగ్‌‌లు అందిస్తాం. వారు ప్రత్యేక క్యూలలో వెళ్లవచ్చు" అని ప్రశాంత్​ తెలిపారు.