ఎన్ని లక్షలు సంపాదిస్తే మధ్య తరగతి.. కొనుగోళ్లలో వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి..!

ఎన్ని లక్షలు సంపాదిస్తే మధ్య తరగతి.. కొనుగోళ్లలో వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి..!

మధ్య తరగతి వారు అంటే ఎవరు.. ఎంత సంపాదిస్తే.. ఎంత ఆదాయం ఉంటే వాళ్లను మధ్య తరగతిగా గుర్తిస్తారు.. అసలు మధ్య తరగతి కుటుంబాలను కంపెనీలు ఎలా డిసైడ్ చేస్తాయి.. వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి.. వాళ్ల కొనుగోళ్లు ఎలా ఉంటాయి అనేది ఆయా కంపెనీల యాజమాన్యాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read :- గుడ్డును పర్ఫెక్ట్గా ఉడికించడం ఎలా? 

  • సంవత్సరానికి 5 నుంచి 30 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్న కుటుంబాలను మధ్య తరగతిగా భావిస్తున్నాయి కంపెనీలు.
  • వీళ్ల ఆలోచనలు బ్రాండెడ్ వైపు ఉంటాయి.. కాకపోతే ఖర్చులకు తగ్గట్టు నిత్యావసరాల కొనుగోలులో వ్యత్యాసం ఉంటుందంట. బ్రాండెడ్ సబ్బు కొంటారు కాకపోతే.. రెగ్యులర్ గా 100 గ్రాముల సబ్బు బదులు 75 గ్రాముల సబ్బు తీసుకుంటారు. ఈ విధంగా తమ ఖర్చులను ఆదా చేసుకుంటారంట. 
  •  గృహాపకరాల విషయంలో మాత్రం మధ్య తరగతి వారు పెద్దగానే ఆలోచిస్తారంట. చిన్న సబ్బు కొన్నా.. ఇంట్లో టీవీ మాత్రం పెద్దది తీసుకుంటారంట. 
  •  ఇంట్లోని గృహాపకరాల కొనుగోళ్లను.. అంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, సోఫాసెట్స్, ఏసీలు.. ఇలాంటి వస్తువులను EMI ద్వారా కొనుగోలు చేసే మధ్య తరగతి కుటుంబాలు 75 శాతం అంట. 
  •  ఐదేళ్ల క్రితం 50 శాతంగా ఉన్న మధ్య తరగతి EMI కొనుగోళ్లు.. 2024 నాటికి 75 శాతానికి పెరిగిందంట. 
  •  EMI ఆప్షన్ సులభతరం కావటంతో.. మధ్య తరగతి కుటుంబాలు బ్రాండెడ్ వస్తువులకే మొగ్గు చూపుతున్నారంట.
  • బంగారం పథకాల్లో పెట్టుబడి పెట్టే మధ్య తరగతి కుటుంబాలు.. తక్కువ వ్యవధి అంటే 12, 15, 18 నెలల కాలానికి మాత్రం ఆసక్తి చూపిస్తున్నారంట. 
  •  కరోనా తర్వాత టెక్నాలజీ అప్ గ్రేడ్ విషయంలో మధ్య తరగతి కుటుంబాలు వేగంగా అడుగులు వేస్తాయని మార్కెట్ వర్గాలు భావించినా.. ఆశించిన స్థాయిలో అలా జరగలేదంట. దీని వల్ల కొన్ని గృహాపకరణాల కంపెనీల తయారీదారుల అంచనాలు తలకిందులు అయ్యాయంట. మధ్య తరగతి కుటుంబాలు ఆశించిన స్థాయిలో జీతాలు పెరగకపోవటం ప్రధాన కారణం అంట. కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, ఐపాడ్స్ ఇలాంటి కొనుగోళ్లలో మధ్య తరగతి నుంచి ఆయా కంపెనీలకు పెద్దగా డిమాండ్ రాలేదంట. 
  •  మధ్య తరగతి కుటుంబాలు ఖర్చులు తగ్గించుకోవటానికి చిన్న ప్యాక్స్ అంటే.. బ్రాండెడ్ లోని తక్కువ ధర ఉన్న ప్యాకెట్లు.. 25, 50 గ్రాముల సబ్బులు.. అదే విధంగా కిలోలు కాకుండా అర కిలో ప్యాకెట్స్, పెద్ద షాంపూ బాటిల్స్ కాకుండా చిన్న షాంపూ బాటిల్స్.. ఇలాంటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారంట. అంటే ఖర్చులు తగ్గించుకునే క్రమంలో చిన్న ప్యాకెట్ల వైపు మొగ్గుచూపుతున్నారని ఆయా కంపెనీలు గుర్తించి.. అందుకు తగ్గట్టుగానే ఉత్పత్తులు ప్రారంభించాయంట. 

భారతదేశంలోని మధ్య తరగతి ప్రజల కొనుగోలు ఆలోచనలను ఆయా కంపెనీలు ఇలా వెల్లడించాయి.