కారు గుద్దితే ఎగిరి పడ్డాడు

హైదరాబాద్ : వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలని అధికారులు హెచ్చరిస్తున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. ఒకరి నిర్లక్ష్యం వల్ల మరొకరు బలైపోవాల్సి వస్తోంది. తాజాగా నాగోల్ లో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ వ్యక్తిని స్పీడ్ గా వచ్చిన కారు ఢీకొంది. దీంతో కారు ఢీకొనగానే సదరు వ్యక్తి.. గాల్లో ఎగిరి పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి తాకి కింద పడిపోయాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. 

వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు స్థానికంగా ఉన్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న జైబాబు(50)గా గుర్తించారు.