
టీవీ నారాయణ నిరాడంబరుడు : వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై పద్మశ్రీ టీవీ నారాయణ విగ్రహం పెట్టాలని బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పద్మశ్రీ టీవీ నారాయణ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు హాజరైన వివేక్ వెంకటస్వామి... టీవీ నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... టీవీ నారాయణ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబెర్ గా ఉండి కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ నిరాడంబర జీవితాన్ని గడిపారన్నారు. విద్యా విధానంలో మార్పులు రావాలని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. ఆయన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిందని గుర్తు చేశారు. టీవి నారాయణ సతీమణి, మాజీ మంత్రి టీ.ఎన్ సదాలక్ష్మి సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారన్నారు. నేటి తరానికి టీవీ నారాయణ జీవితం ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం:
పూలు పూయించలేదని... తోటమాలీలను జైళ్లో పెట్టిన కిమ్