ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలి

 ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలి
  •  మంత్రి పొన్నం ప్రభాకర్ కు గౌడ సంఘాల విజ్ఞప్తి 

ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోనిట్యాంక్​బండ్​పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని గౌడ సంఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో  వివిధ గౌడ సంఘాల నేతలు గురువారం  మంత్రిని కలిశారు. 

నీరా కేఫ్ బిల్డింగ్​ను గీత కార్పొరేషన్ కు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు.  బీసీలకు విధాలుగా అండగా ఉంటామన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. 

రెండో విడతలో భాగంగా 15 వేల మంది గౌడ్​లకు కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ కిట్స్ ఇస్తామన్నారు. పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  నేతలు బండి సాయన్న గౌడ్, చీకటి ప్రభాకర్ గౌడ్, చిక్కిళ్ళ మధుసూదన్ గౌడ్, గుర్రం దేవేందర్ గౌడ్, ముద్దగోని రామ్మోహన్ గౌడ్, మీరయ్య గౌడ్ పాల్గొన్నారు.