
ఖైరతాబాద్, వెలుగు: పద్మశ్రీ వనజీవి రామయ్య చనిపోలేదని.. ప్రకృతి, పర్యావరణం ఉన్నంత కాలం జీవించే ఉంటారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రామయ్య సంస్మరణ సభ నిర్వహించారు.
తెలంగాణ శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సమాజ్అధ్యక్షుడు సంగెం సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రామయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. ట్యాంక్ బండ్పై, ఖమ్మంలో ఆయన విగ్రహం పెట్టాలని కోరారు.
జూలై 1న రామయ్య జయంతి అధికారికంగా జరపాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. సంఘం అధ్యక్షుడు వి. రవిశంకర్, గౌరవ అధ్యక్షుడు కె.దశరథ్రావు, ప్రధాన కార్యదర్శి కె.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.