చదువుకోవడం ఇష్టం లేక స్టూడెంట్ సూసైడ్

వీణవంక, వెలుగు : చదువుకోవడం ఇష్టం లేక ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్​జిల్లా వీణవంక మండలం గన్ముకులలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన గాజుల తిరుపతి కుమారుడు శశికుమార్ (19) హుస్నాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒకేషనల్ కోర్సు సెకండియర్ చదువుతున్నాడు. 

తనకు చదువు ఇష్టం లేదంటూ ఇటీవల ఇంటికి వచ్చేశాడు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేశారు.