మేడ్చల్ లో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ లో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురుకుల పాఠశాలలో చదువుతున్న ఉటుకూరి సృజన(15).. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ ఎస్సీ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. అదే గ్రామానికి పక్కన ఉన్న గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సృజన ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? కారణాలు ఏంటి..? అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కూతురు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సృజన తండ్రి కుమారస్వామి ఫిర్యాదుతో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు