
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. బజారత్నూర్ మండలం మొర్కండి గ్రామానికి చెందిన లాలిత్య గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత కొన్ని రోజులుగా చదువుతోంది. లాలిత్య అనారోగ్య కారణాల వల్ల మార్చి 10న మృతి చెందింది. అయితే లాలిత్య అనారోగ్యం పై తమకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు .
ఘటనా స్థలానికి వచ్చిన బోథ్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం బోథ్ ఆసుపత్రికి తరలించారు . కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బాదిత కుటుంబాన్ని అదుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.