పెనుబల్లి, వెలుగు : టీఎస్ పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో పెనుబల్లిలోని రమేశ్ స్కై స్కూల్స్టూడెంట్కు స్టేట్ఫస్ట్ర్యాంక్ సాధించాడు. మండలం కేంద్రంలో గతేడాది ప్రారంభించిన రమేశ్ స్కై స్కూల్ కు చెందిన విద్యార్థి తూమాటి హరీశ్120 కి 120 మార్కులు సాధించి స్టేట్ఫస్ట ర్యాంక్సాధించాడు. హరీశ్ టెన్త్ ఫలితాల్లో 10/10జీపీ సాధించగా.. ఇదే స్కూల్ లో ఫాలిసెట్ కోచింగ్ తీసుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పొందారు.
అలాగే తమ స్కూల్కు చెందిన వంకాయలపాటి ఉదయశ్రీ 159వ ర్యాంక్, ధనూష్ దత్తు 625 ర్యాంక్ సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కురివేటి రమేశ్ బాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోనే ఏ స్కూల్సాధించలేని ఘనత తమ స్కూల్ ఏడాదిలోనే సాధించిందని చెప్పారు. ర్యాంకర్లను టీచర్లు, తల్లిదండ్రులు అభినందనందించారు.