స్కూల్ ​వద్ద స్టూడెంట్ కు పాము కాటు

కాగజ్ నగర్, వెలుగు : ప్రభుత్వ స్కూల్​కు వచ్చిన స్టూడెంట్ నీళ్ల సంపుపై ఉన్న పైకప్పు తీసేందుకు వెళ్లగా దానికింద ఉన్న పాము కాటు వేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం అచ్చెలి పాఠశాల గ్రౌండ్ లో స్టూడెంట్స్​రోజూ ఆడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నాలుగో తరగతి చదువుతున్న దర్శిని ఆడుకుంటూ వెళ్లి స్కూల్ కాంపౌండ్ లో ఉన్న నీళ్ల  సంపు మీదున్న కప్పు తీసేందుకు ప్రయత్నించింది. దీంతో దానికింద ఉన్న పాము ఆమెను కాటు వేసింది. దర్శిని బాధతో అరవడంతో స్థానికులు టీచర్ కి సమాచారం ఇచ్చి సిర్పూర్ టి సివిల్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం మంచిర్యాల దవాఖానకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వేంపల్లి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ ఎం వేణుగోపాల్ చెప్పారు.