గురుకుల స్టూడెంట్​కు పాముకాటు

గురుకుల స్టూడెంట్​కు పాముకాటు
  • గురుకుల స్టూడెంట్​కు పాముకాటు
  • రాత్రి కరిస్తే.. తెల్లారి ఆస్పత్రికి తీసుకెళ్లిన సిబ్బంది
  • కండిషన్​ సీరియస్​గా ఉన్నా పట్టించుకోని ప్రిన్సిపల్​

కొత్తకోట, వెలుగు :  వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని  వీపనగండ్ల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఓ స్టూడెంట్​కు పాము కరిచి కోమాలోకి వెళ్లిపోయాడు. స్టూడెంట్ తండ్రి పరమేశ్​  తెలిపిన వివరాల ప్రకారం.. పాన్​గల్​ మండలం బాద్రుగూడెం గ్రామానికి చెందిన మహేందర్​ వీపనగండ్ల గురుకుల పాఠశాలలో టెన్త్​ చదువుతున్నాడు. రాత్రి అన్నం తిని పడుకున్న మహేందర్​ను 10 గంటలకు పాము కాటు వేయడంతో అక్కడ ఉన్న స్టూడెంట్లు ప్రిన్సిపల్​దయాకర్​కు సమాచారం అందించారు. అయితే  ప్రిన్సిపల్​ ఎలాంటి ట్రీట్​మెంట్​ అందించే ప్రయత్నం చేయకుండా పడుకోమని ఆదేశించాడు.

ALSO READ :గవర్నర్ ఢిల్లీ టూర్ ​ 

పొద్దున మహేందర్​ కండిషన్​ సీరియస్​ కావడంతో డ్యూటీలో ఉన్న సిబ్బంది వాచ్​మన్​తో జిల్లా హాస్పిటల్​కు తరలించారు. 9 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మహేందర్​ పరిస్థితి క్రిటికల్​ గా ఉందని డాక్టర్లు చెప్పినా ప్రిన్సిపల్​ అక్కడికి రాలేదు. ప్రిన్సిపల్​ తీరుపై  స్టూడెంట్​ తండ్రి పరమేశ్​, స్టూడెంట్​ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సస్పెండ్​ చేయాలని డిమాండ్​చేస్తున్నాయి. ప్రిన్సిపల్​ను ఫోన్​ ద్వారా వివరణ అడిగితే.. అనారోగ్య సమస్యలు ఉన్నందున రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. కాగా  మహేందర్​ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​హాస్పిటల్​కు తరలిస్తున్నట్లు  బద్రుగూడెం సర్పంచ్​విష్ణు తెలిపారు.