గురుకులంలో స్టూడెంట్​కు పాముకాటు.. వైరాలో ఘటన

వైరా, వెలుగు :  ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కాలేజీ (టీఎస్ డబ్ల్యూఆర్ఎస్)లో ఇంటర్​ స్టూడెంట్​ను పాము కాటు వేసింది.

ఇంటర్ స్టూడెంట్​ కొంగర ప్రసన్న సోమవారం రాత్రి కాలేజీలో డైనింగ్ హాల్​లో భోజనం చేస్తున్న సమయంలో పాము కాటు వేసింది. అక్కడే ఉన్న టీచర్లు వెంటనే వైరాలోని పీహెచ్​సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు