బోధన్,వెలుగు: బోధన్ పట్టణంలోని ఇందూర్ స్కూల్లోని 8వ తరగతి విద్యార్థి బి.సాయిరాం జులై 26న స్కూల్ నుంచి అదృశ్యమై సోమవారం తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. దీంతో బోధన్ పోలీసులు, స్కూల్యాజమాన్యం విద్యార్థిని చాకచక్యంగా పట్టుకున్నట్లు పట్టణ సీఐ వీరయ్య తెలిపారు. జులై 26న స్కూల్ నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి రెండు పోలీసు బృందాలతో గాలించారు. మీడియా, పత్రికలు, టీవీలలో ప్రచారం కావడంతో విద్యార్థి తిరుపతిలో ఉన్నట్లు సీఐకి ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి పోలీసులు, స్కూల్ యాజమాన్యాన్ని పంపించి పట్టుకున్నట్లు సీఐ తెలిపారు.