
- వికారాబాద్ జిల్లా కిష్టాపూర్లో ఘటన
పరిగి, వెలుగు: టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఫెయిలైన ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం కిష్టాపూర్ గ్రామంలో జరిగింది. కిష్టాపూర్కి చెందిన కుందేల కిష్టయ్య పెద్ద కొడుకు నందు(16) స్థానిక హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో టెన్త్ ఎగ్జామ్స్ రాయగా మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఫెయిలయ్యాడు. జూన్ లో సప్లిమెంటరీ ఎగ్జామ్ రాశాడు. శుక్రవారం టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ కాగా నందు మళ్లీ ఫెయిలయ్యాడు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నందు సూసైడ్ చేసుకున్నాడు. శనివారం ఉదయం గ్రామ శివారులోని చింతచెట్టుకు నందు ఉరేసుకుని కనిపించాడు. నందు తండ్రి కిష్టయ్య ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేశామని ఎస్సై విశ్వజన్ తెలిపారు.