జయప్రకాశ్​ నారాయణ భూదాన పర్యటన

జయప్రకాశ్​ నారాయణ భూదాన పర్యటన

1952 సంవత్సరంలో జయప్రకాశ్​ నారాయణ ఆయన భార్య ప్రభావతి దేవితో కలిసి మహబూబ్​నగర్ జిల్లాలో భూదాన పర్యటన చేశారు. ఈ సందర్భంగా జయప్రకాశ్​ నారాయణ ఉపన్యాసాలకు ప్రభావితమై చాలా మంది భూదానాలు చేశారు. ఈ పర్యటనకు కూడా కేతిరెడ్డి కోదండరామిరెడ్డి ఇన్​చార్జిగా వ్యవహరించాడు.

రజతోత్సవ పాదయాత్ర

తెలంగాణలో భూదానోద్యమం ప్రారంభమై 25 సంవత్సరాలు ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకొని భూదాన యజ్ఞమండలి ఉపాధ్యక్షుడు జి.మాణిక్యరావు నాయకత్వంలో భూదాన కార్యకర్తల బృందం రజతోత్సవ పాదయాత్ర నిర్వహించారు. 

1975, ఏప్రిల్​ 18న అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్​ అలీ అహ్మద్​ హైదరాబాద్​లో భూదాన జ్యోతిని వెలిగించి భూదాన రజతోత్సవాలను ప్రారంభించారు.
 
భూదాన జ్యోతిని తీసుకుని 1975, ఏపిల్​ 19 నుంచి 1976, ఏప్రిల్​ 18 వరకు ఈ రజతోత్సవ పాదయాత్ర జరిగింది. 

రజతోత్సవ కార్యనిర్వాహక వర్గం

  • అప్పటి ఏపీ రాష్ట్ర సీఎం జలగం వెంగళరావు అధ్యక్షతన భూదానోద్యమ రజతోత్సవ కార్యనిర్వాహక వర్గం ఏర్పడింది.
  • కార్యనిర్వాహక అధ్యక్షుడు – పి.నరసారెడ్డి (రెవెన్యూ శాఖ మంత్రి)
  • కార్యనిర్వాహక కార్యదర్శి – సి.వి.చారి (భూదాన యజ్ఞమండలి ఉపాధ్యక్షుడు) 

కార్యక్రమ లక్ష్యాలు 

  • పంపిణీ కాకుండా మిగిలి ఉన్న భూదాన భూముల పంపిణీ.
  • ప్రభుత్వ భూకమతాల చట్టానికి లోబడి భూదానాలు స్వీకరించడం.
  •  భూదాన్​–గ్రామదాన్– గ్రామ స్వరాజ్య సిద్ధాంతాలు, ఆదర్శాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. 
  • ఇందులో భాగంగానే రాష్ట్రంలో మూడుచోట్ల శిక్షణా శిబిరాలు నిర్వహించారు. వాటిలో తెలంగాణలోని యాదగిరిగుట్ట ఒక శిక్షణా శిబిరం. 
  • భూదానోద్యమ రజతోత్సవ ముగింపు సమావేశాలు 1976, ఏప్రిల్​ 18, 19వ తేదీల్లో తిరుపతిలో జరిగాయి. 
  • ముగింపు సమావేశంలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, గవర్నర్ మోహన్​లాల్​ సుఖాడియా పాల్గొన్నారు.