టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్(A.R.Murugadoss) తన మూవీస్ తో బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశారు. గత కొంత కాలంగా సక్సెస్‌తో తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని రీసెంట్ గా ఓ ప్రాజెక్ట్‌ను లాక్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో నేచురల్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) తో మూవీ తీయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ థ్రిల్ ఎలిమెంట్స్‌తో కూడిన..ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో స్టోరీ రాసుకున్నారట.
అలాగే ఓక ఇంట్రెస్ట్ లవ్ స్టోరీ ఈ మూవీలో ఉండనుందని సమాచారం. అందుకు నేచురల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఈ మూవీలో శివకార్తికేయన్ కు జోడీగా కనిపిస్తున్నారని టాక్. వీరి కాంబోకు స్పెషల్ ఫ్యాన్స్ ఉండటంతో ఫుల్ ఖుషి అవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో రిలీజ్ కాబోతుండగా..టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారట.
శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ అయాలాన్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. రవికుమార్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. 4,500కి పైగా షాట్‌లను కలిగి ఉన్న ఈ చిత్రం భారీ బడ్జెట్ గా రూపొందిస్తున్నారు మేకర్స్.
మురుగదాస్ డైరెక్షన్ లో వస్తోన్న మూవీ శివ కార్తీకేయన్ కు రెండో పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. అందుకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. 2023 డిసెంబర్ చివరి నాటికి వీరి ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ఈ మూవీకు అద్దిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి.
ALSO READ :తీరం చేరిన యుద్ధనౌక.. గద్దర్పై పవన్ ప్రత్యేక కావ్యం
హనురాఘవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం మూవీతో హీరోయిన్ గా నటించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా లో మృణాల్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం నాని నటిస్తున్న హాయ్ నాన్న, అలాగే విజయ్ దేవరకొండ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోన్న మృణాల్..ఈ మూవీకు స్పెషల్ అట్ట్రాక్ట్ గా మారనుంది.
డైరెక్టర్ గా మురుగదాస్ యొక్క చివరి మూవీ రజినీకాంత్ దర్బార్, అంతకు ముందు వచ్చిన సర్కార్, స్పైడర్ మూవీస్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో హిట్ కోసం బాగా కసిగా ఉన్న మురుగదాస్ కంబ్యాక్ ఇస్తాడో? లేదో? చూడాలి.