పిచ్చుకలను కాపాడుకోవాలి : ఎ.సుభాష్

పిచ్చుకలను కాపాడుకోవాలి : ఎ.సుభాష్

బెల్లంపల్లి, వెలుగు: మనిషి మనుగడకు, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషించే పిచ్చుకలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎ.సుభాష్ అన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవ సందర్భంగా బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని బాలుర సీఓఈ రెసిడెన్షియల్  పాఠశాలలో పిచ్చుకల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలపై సదస్సు నిర్వహించగా సుభాష్ హాజరై మాట్లాడారు.

సెల్‌ఫోన్‌ టవర్ల ద్వారా విడుదలయ్యే రేడియేషన్‌తో పిచ్చుకలు ప్రాణాలొదులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చుకలతో సమాజానికి ఎంతోమేలు జరుగుతోందని, వాటి మనుగడుకు అవసరమైన గూళ్లు, ఆహారం, నీరు ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని మట్టి చిప్పల్లో పిచ్చుకలకు నీరు పోసి ఉంచాలన్నారు. పిచ్చుకల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు మట్టి చిప్పలు అందజేశారు. డిప్యూటీ క్షేత్ర అధికారులు గౌరీ శంకర్, ప్రవీణ్ నాయక్, శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తదితరులు పాల్గొన్నారు.