శబరిమలకు వెళ్లిన సూర్యాపేటవాసికి గుండెపోటు

సూర్యాపేట, వెలుగు:  శబరిమలకు వెళ్లిన సూర్యాపేట వాసి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎస్) మండలం  తుమ్మల పెన్ పహాడ్  గ్రామానికి చెందిన ఉయ్యాల లింగయ్య(37)  సూర్యాపేట లోని ఖమ్మం వే బ్రిడ్జ్ వెనకాల నివాసం ఉంటున్నారు.

అయ్యప్ప మాల ధరించిన ఈయన శబరిమలకు వెళ్లాడు. సోమవారం అయ్యప్ప స్వామి సన్నిధానానికి సమీపంలో గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలాడు.  తోటి స్వాములు సీఆర్పీ చేసినా అప్పటికే ప్రాణాలు పోయాయి. డెడ్‌బాడీని మంగళవారం స్వగ్రామానికి తీసుకురానున్నారు.