సమ్మక్క - సారక్కకు కారెత్తు బంగారం !

బెజ్జంకి, వెలుగు:  సమక్క సారక్కల పేరు వినగానే ప్రతి ఒక్కరికీ నిలువెత్తు బంగారం మొక్కు గుర్తుకొస్తుంది. తమ సమస్యలు తీరగానే నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్ల కు సమర్పించడం ఆనవాయితీ. కానీ, ఒక టాక్సీ డ్రైవర్ తన కారు బరువుకు సమానంగా బంగారాన్ని తూకం వేసి మేడారంలో అమ్మవార్లకు సమర్పించడానికి బయలుదేరాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన రమణాచారి కారు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కష్టాలు తీరితే కారు బరువుకు సమానంగా  బంగారం సమర్పించుకుంటానని సమక్క సారక్కలకు మొక్కుకున్నాడు.  అనుకున్నది నెరవేరడంతో పాటు  మరొక కారు కొనడంతో అమ్మవార్ల మొక్కు తీర్చడానికి సిద్ధమయ్యాడు. మేడారంలో కారును తూకం వేసే పరిస్థితి ఉంటుందో ఉండదో అని వే బ్రిడ్జిపై పై కారును తూకం వేసి అందుకు సమానంగా (1340 కిలోలు)  బంగారాన్ని తీసుకొని కుటుంబసభ్యులతో కలిసి మేడారం బయలుదేరాడు. తూకం వేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.–