స్కూల్​లో స్టూడెంట్​తో కారు కడిగించిన టీచర్

  • స్కూల్​ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా 

జూలూరుపాడు, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు జడ్పీ హైస్కూల్​లో స్టూడెంట్​తో టీచర్​ కారు కడిగించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​అయ్యింది. దీంతో టీచర్​ తీరును నిరసిస్తూ మంగళవారం స్కూల్​ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. స్కూల్​లో ఫిజికల్ డైరెక్టర్ అరుణకుమారి 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థితో స్కూల్​ టైమ్​లో తన కారును కడిగించింది.

దీంతో అరుణకుమారిని విధుల నుంచి తొలగించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనిపై స్కూల్​ హెడ్మాస్టర్​ లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ విషయం తన దృష్టికి వచ్చిందని,  పై అధికారులకు చెప్పడంతో టీచర్ కు మెమో ఇచ్చారన్నారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ, అభిమిత్ర, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా పాల్గొన్నారు.