ఫుల్గా మందు తాగి డ్యూటీకి వచ్చిన టీచర్‌‌‌‌

ఫుల్గా మందు తాగి డ్యూటీకి వచ్చిన టీచర్‌‌‌‌

ములకలపల్లి, వెలుగు : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్‌‌‌‌ మద్యం తాగి డ్యూటీకి హాజరయ్యారు. గమనించిన గ్రామస్తులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్‌‌‌‌నగర్‌‌‌‌ కాలనీ ప్రైమరీ స్కూల్‌‌‌‌లో పత్తిపాతి వీరయ్య ఎస్‌‌‌‌జీటీగా పనిచేస్తున్నాడు. 

శుక్రవారం మద్యం సేవించి స్కూల్‌‌‌‌కు వచ్చాడు. నడవలేకుండా పడిపోయిన టీచర్‌‌‌‌ను స్థానికులు గమనించి పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తరలించారు. ఇతడు రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడని, గతంలో కూడా ఇలాగే లిక్కర్‌ తాగి స్కూల్‌‌‌‌కు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు ఎంఈవో శ్రీరామమూర్తికి ఫిర్యాదు చేశారు.