
హైదరాబాద్, వెలుగు : మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ప్రతినిధుల బృందం బుధవారం మహారాష్ట్రలో పర్యటించనుంది. షోలాపూర్‌లో పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ రథోత్సవంలో హరీశ్‌రావు సహా బీఆర్ఎస్నాయకులు పాల్గొననున్నారు. ఆయన వెంట హోం మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ ఎల్. రమణ, బీఆర్ఎస్మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు వెళ్తున్నారు. మార్కండేయ రథోత్సవంలో పాల్గొన్న అనంతరం షోలాపూర్‌లో బీఆర్ఎస్నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం స్థలాన్ని పరిశీలించనున్నారు.